ఇంట్లోనే తోట పెంచాలనుకునే వారికి ఎక్కువ శ్రమ లేకుండా ఏడాది పొడవునా ఫ్రెష్ ఆకుకూరలు ఇచ్చే కొన్ని మొక్కల వివరాలు మీకోసం.
పుదీనాను ఒకసారి నాటితే చాలా వేగంగా పెరుగుతుంది. దీని ఆకులు కోసే కొద్దీ కొత్త చిగుళ్లు వస్తూనే ఉంటాయి. దీనికి తేమ ముఖ్యం.
వంటల్లో రోజూ వాడే కరివేపాకు మొక్కను ఒక్కసారి నాటితే చాలు. ఇది ఎక్కువ కాలం జీవిస్తూ ఏళ్ల తరబడి ఆకులను ఇస్తూనే ఉంటుంది.
తక్కువ సంరక్షణతో పెరిగే మునగాకులో పోషకాలు చాలా ఎక్కువ. కొమ్మలను కత్తిరిస్తూ ఉంటే చాలు, కొత్త చిగుళ్లు వేగంగా వస్తాయి.
మన వాతావరణానికి బచ్చలికూర బెస్ట్ ఆప్షన్. కుండీలో నాటినా కూడా తీగలా అల్లుకుంటూ ఏడాది పొడవునా మంచి దిగుబడిని ఇస్తుంది.
వీటిని వేళ్లతో పీకకుండా కేవలం పై ఆకులను మాత్రమే కోసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే మొక్క నుండి 3-4 సార్లు కోత కోయవచ్చు.
కొత్తిమీర ఒకేసారి వస్తుంది. కాబట్టి ప్రతి రెండు వారాలకు ఒకసారి కొత్త విత్తనాలు చల్లుకుంటే ఏడాది మొత్తం కొత్తిమీర లభిస్తుంది.