20th May 2026

____________

- Saidulu

ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..

వేసవి వేడిలో బయట నుంచి ఇంటికి రాగానే చాలామంది ఫ్రిజ్‌లోని చల్లటి నీటినే వెంటనే తాగేస్తుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే అవకాశం ఉంటుంది.

మన పొట్టలో ఆహారం జీర్ణం కావడానికి జీర్ణరసాలు సహాయపడతాయి. కానీ ఎక్కువ చల్లటి నీరు తాగితే ఆ ప్రక్రియ సరిగా జరగక గ్యాస్, అసిడిటీ సమస్యలు రావచ్చు.

చల్లటి నీరు తరచూ తాగడం వల్ల ఆహారం పూర్తిగా అరగక కడుపులో అసౌకర్యం కలుగుతుంది. కొంతమందిలో కడుపు ఉబ్బరం కూడా కనిపించవచ్చు.

తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలు చల్లదనం కారణంగా గట్టిపడే అవకాశం ఉంటుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఫ్రిజ్ వాటర్ అధికంగా తాగితే శరీరంలో కొవ్వు సరిగా కరగక బరువు పెరగడానికీ కారణమవుతుంది. అందుకే పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది.

అతిగా చల్లటి నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. కొంతమందిలో గుండె వేగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

వేసవిలో దాహం తీర్చుకోవడానికి మట్టి కుండ నీరు మంచి ఎంపికగా భావిస్తారు. ఇది సహజంగా చల్లగా ఉండటంతో పాటు శరీరానికి హాయిని అందిస్తుంది.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అలవాట్లలో చిన్న మార్పులు చాలా అవసరం. చల్లటి నీటికి బదులుగా సహజమైన నీటిని తీసుకోవడం మంచిది.