మే 8, 2026 (శుక్రవారం) రోజున చంద్రుని స్థితి, నక్షత్రాల ప్రభావం ఆధారంగా ద్వాదశ రాశుల జీవితాల్లో వివిధ మార్పులు కనిపించనున్నాయి.క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, సింహం, కన్యా రాశుల వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి.
మేష రాశి వారికి ఈ రోజు ప్రారంభించిన పనులు సజావుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.
వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. బుధాదిత్య రాజయోగ ప్రభావం వల్ల కొత్త అవకాశాలు కూడా దక్కవచ్చు.
మిథున రాశి వారికి ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కృషికి తగిన ఫలితం దక్కే రోజు ఇది. కర్కాటక రాశి వారికి పనిలో ఒత్తిడి ఉన్నా, మీ సహనం, పట్టుదలతో అన్ని పనులు పూర్తవుతాయి.
కర్కాటక రాశి వారికి పనిలో ఒత్తిడి ఉన్నా, మీ సహనం, పట్టుదలతో అన్ని పనులు పూర్తవుతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
సింహ రాశి వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
కన్య రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని జాగ్రత్తగా అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం అవసరం.
తుల రాశి వారికి దూర ప్రయాణాల సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనవసర ఖర్చులు తగ్గించాలి.
వృశ్చిక రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వినిపించే సూచనలు ఉన్నాయి.
ధనస్సు రాశి వారికి పిల్లల భవిష్యత్తు సంబంధిత ముఖ్య చర్చలు జరుగుతాయి. ఓర్పుతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మకర రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకునే రోజు ఇది. ఆకస్మిక ధనలాభం లేదా అవకాశాలు రావచ్చు.
కుంభ రాశి వారికి ఇతరుల సహకారంతో పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపించే సూచనలు ఉన్నాయి.
మీన రాశి వారికి కుటుంబంలో శుభకార్యాల ఆనందం ఉంటుంది. వృత్తి జీవితంలో అనుకూల ఫలితాలు దక్కే అవకాశం ఉంది.