చాణక్యుడు జీవితాన్ని బలంగా నిలబెట్టే కొన్ని ముఖ్యమైన సూత్రాలను చెప్పాడు. అవి వ్యక్తిగత గోప్యత, గౌరవం ,ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు మార్గదర్శకంగా ఉంటాయి.
ఆర్థిక ఇబ్బందులు లేదా డబ్బు లేకపోవడం గురించి ప్రతి ఒక్కరితో చెప్పకూడదని ఆయన సూచించాడు. అలా చెప్పడం వల్ల మనపై నమ్మకం తగ్గి అవకాశాలు కూడా తగ్గిపోవచ్చు.
మన ఆరోగ్య సమస్యలను అనవసరంగా అందరితో పంచుకోవడం కూడా మంచిది కాదు.అవసరమైన సందర్భాల్లో మాత్రమే చెప్పాలి, లేకపోతే అది బలహీనతగా మారుతుంది.
డబ్బు పోగొట్టుకున్న విషయాన్ని ఇతరులకు తెలియజేయడం కూడా సరైన చర్య కాదు.ఇలాంటి విషయాలు బయటకు వస్తే గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది.
కుటుంబ విషయాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామిలోని లోపాలను బయటపెట్టకూడదని ఆయన స్పష్టం చేశాడు.ఇది కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయకుండా కాపాడే ముఖ్యమైన నియమం.
వ్యక్తిగత సమస్యలను తరచుగా ఇతరుల ముందు చెప్పడం మన బలాన్ని తగ్గిస్తుంది. మౌనం ,గోప్యత మన వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చూపిస్తాయి.
గోప్యంగా ఉంచాల్సిన విషయాలను గోప్యంగానే ఉంచడం జీవితం స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.దీనివల్ల మనపై గౌరవం, నమ్మకం రెండూ పెరుగుతాయి.
చివరగా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం గొప్పతనం. సరైన మౌనం కూడా జీవితంలో విజయం సాధించడానికి శక్తివంతమైన ఆయుధం అన్నది మనం ఎప్పుడూ ఆచరించాల్సిన చాణిక్య నీతి.