సమ్మర్ వేడిని తట్టుకోవడానికి మనలో చాలామంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటాం. అయితే ఈ అలవాటు వల్ల తెలియకుండా మన ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుంది.
కూల్ డ్రింక్స్ ఉన్న అధిక చక్కెర , కెమికల్స్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తాత్కాలికంగా చల్లదనం ఇచ్చినా దీర్ఘకాలంలో సమస్యలు కలిగిస్తాయి.
కూల్ డ్రింక్స్ తరచుగా తాగడం వల్ల బరువు పెరుగుదల జరుగుతుంది. ఇందులోని అధిక కేలరీలు కొవ్వుగా మారతాయి. ఒబెసిటీ ప్రమాదం పెరుగుతుంది.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. శరీరంలో ఇన్సూరెన్స్ అమతుల్య తన దెబ్బతీసి డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
దంతాల ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుంది. పళ్ల పై ఎనామెల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కవిటీస్ మరియు దంత క్షయం సమస్యలు పెరుగుతాయి.
ఇవి జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తాయి. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
అధికంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రక్తపోటు స్థాయిలు మారే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో హృదయ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
కూల్ డ్రింక్స్‌కు బదులుగా సహజ పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నీరు, కొబ్బరి నీరు వంటి ఎంపికలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.