6th May 2026

____________

- Saidulu

జుట్టును బలపరిచి దృఢంగా చేసే రోజ్మేరీ బెనిఫిట్స్..

రోజ్మేరీ అనేది సహజమైన ఔషధ మొక్క. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

హెయిర్ హెల్త్ కోసం కెమికల్ ప్రోడక్ట్స్‌కి బదులుగా నాచురల్ ప్రొడక్ట్స్ వాడడం మంచిది. అందులో రోజ్మేరీ ప్రత్యేక స్థానం సంపాదించింది.

రోజ్మేరీ నూనె తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని వల్ల జుట్టు రూట్స్ బలంగా మారతాయి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కొత్త జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

రోజ్మేరీ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచి దురద , ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.

రోజ్మేరీ నూనెను కొబ్బరి నూనెతో కలిపి వాడవచ్చు. ఇలా చేయడం వల్ల దాని ప్రభావం మరింత పెరుగుతుంది.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆయిల్ ఉపయోగించడం మంచిది. తలకి మృదువుగా మసాజ్ చేయాలి. పలుచని జుట్టు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. సహజంగా జుట్టు వాల్యూమ్ పెరుగుతుంది.

రోజ్మేరీ టీ కూడా తాగవచ్చు. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతర్గతంగా కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడ్పడుతుంది.

కొంతమంది రోజ్మేరీ నీటిని జుట్టు కడిగేందుకు ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు సహజమైన మెరుపు ఇస్తుంది.

రోజ్మేరీ ఉపయోగం వల్ల జుట్టు రూట్స్ బలపడతాయి. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. సహజంగా జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.