5th May 2026

____________

- Saidulu

ఈ ఆసనాలతో హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టేయండి..

జుట్టు రాలడం ఈ రోజుల్లో చాలా మందికి కనిపిస్తున్న సమస్య. ఒత్తిడి, అనారోగ్య జీవనశైలి, పోషకాహార లోపం వంటి కారణాలతో హెయిర్ ఫాల్ పెరుగుతుంది.

యోగా ఈ సమస్యను సహజంగా తగ్గించడంలో సహాయపడుతుంది.యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.

తల చర్మానికి సరైన రక్తప్రవాహం చేరడంతో జుట్టు కుదుళ్లు బలపడతాయి. రెగ్యులర్గా యోగా చేసే వారికి హెయిర్ ఫాల్ సమస్య బాగా తగ్గుతుంది.

విపరీత కరణి ఆసనం జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది తలకు రక్తప్రవాహాన్ని పెంచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

అధో ముఖ శ్వానాసనం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గితే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బాలాసనం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి హెయిర్ ఫాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

యోగా రోజూ సాధన చేయడం వల్ల హార్మోన్ సమతుల్యత మెరుగవుతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే జుట్టు సమస్యలు తగ్గుతాయి.

సరైన ఆహారం, మంచి నిద్రతో పాటు యోగా అలవాటు చేసుకుంటే జుట్టు రాలడం సహజంగా తగ్గి జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.