డాండ్రఫ్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తే దీన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
కొబ్బరి నూనెతో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ శుభ్రంగా ఉండి డాండ్రఫ్ తగ్గే అవకాశం ఉంటుంది.
ఓవర్ నైట్ మెంతులను నానబెట్టి పేస్ట్‌గా చేసి తలకు అప్లై చేయడం ద్వారా దురద, పొరలు తగ్గుతాయి.
టీ ట్రీ ఆయిల్ కలిపిన షాంపూలు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది. డాండ్రఫ్ నియంత్రణలో ఉంటుంది.
అలోవెరా జెల్ తలకు రాయడం చర్మానికి తేమ అందించి ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది, స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది.
తలస్నానానికి గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది, అధిక వేడి నీరు స్కాల్ప్ సమస్యలను పెంచుతుంది.
అతిగా ఆయిల్ అప్లికేషన్ చేసి ఎక్కువసేపు ఉంచడం తగ్గించాలి, స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవడం అవసరం.
సమతుల ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ద్వారా శరీర ఆరోగ్యం మెరుగుపడి డాండ్రఫ్ సమస్య అదుపులో ఉంటుంది.