పసుపు, పాలు కలిపి వాడటం చర్మ సంరక్షణలో సహజంగా ఉపయోగించే ఒక చిట్కా. ఈ రెండింటి కలయిక చర్మానికి అనేక విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ఉన్న మలినాలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖం శుభ్రంగా కనిపిస్తుంది.
పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేసి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో సహాయపడుతుంది. స్కిన్ టెక్స్చర్ మెరుగుపడుతుంది.
ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వాడితే ముఖానికి సహజమైన కాంతి రావచ్చు. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
పశుపు పాల పేస్ట్ ముఖంపై ఉన్న చిన్న మచ్చలు, ట్యాన్ తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. స్కిన్ టోన్ సమతుల్యంగా మారుతుంది.
సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న భాగంలో పరీక్షించుకోవడం మంచిది. అలెర్జీ రియాక్షన్ రాకుండా జాగ్రత్త అవసరం.
ఇలా పసుపు, పాలు కలిపిన సహజ మిశ్రమం చర్మానికి నేచురల్ గ్లో అందించడంలో సహాయపడుతుంది.