ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. కానీ ఆరోగ్యకరంగా అనిపించే కొన్ని ఆహారాలు నిజానికి బరువు పెరగడానికి కారణమవుతాయి.
ఫ్రూట్ జ్యూస్‌ను చాలామంది హెల్తీ అనుకుంటారు. కానీ ఇందులో ఫైబర్ తక్కువగా ఉండి చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతుంది.
గ్రానోలా, మ్యూస్లీ వంటి పదార్థాలు కూడా పూర్తిగా హెల్తీ కావు. వీటిలో హిడెన్ షుగర్, కాలరీలు ఎక్కువగా ఉండవచ్చు.
బ్రౌన్ బ్రెడ్‌తో చేసే సాండ్విచ్లు ఆరోగ్యకరమని భావిస్తారు. కానీ అందులో వేసే మేయోనైస్, సాస్‌లు బరువు పెంచుతాయి.
లో-ఫ్యాట్ యోగర్ట్ మంచి ఎంపిక అనిపిస్తుంది. కానీ ఇందులో చక్కెర ఎక్కువగా కలపడం వల్ల కాలరీలు పెరుగుతాయి.
స్మూతీస్ హెల్తీగా కనిపించినా వాటిలో చక్కెర, ఐస్‌క్రీమ్ లేదా సిరప్ కలిపితే బరువు పెరుగుతుంది. సరైన పద్ధతిలో చేయకపోతే ఇది హెల్త్ కి హానికరం.
ఓట్స్ ఆరోగ్యానికి మంచివే కానీ వాటిలో షుగర్, ఫ్లేవర్స్ కలిపితే ప్రయోజనం తగ్గుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
ప్యాన్‌కేక్స్, వాఫిల్స్ వంటి పదార్థాలు హెల్తీగా అనిపించినా వాటిలో చక్కెర, బటర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తరచూ తింటే బరువు పెరుగుతుంది.
బరువు తగ్గాలి అనుకున్న వారు సహజసిద్ధంగా ఉన్న వస్తువులను ఎంచుకోవాలి తప్ప ప్రాసెస్ చేసిన ఫుడ్ కి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.