చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించాలంటే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు తరచూ తీసుకుంటే చర్మంపై ముడతలు త్వరగా కనిపించే అవకాశం ఉంటుంది.
అత్యధికంగా చక్కెర ఉన్న పదార్థాలు తినడం వల్ల చర్మంలో కాలేజన్ తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం గట్టితనం కోల్పోయి ముడతలు త్వరగా వస్తాయి.
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. ఇది చర్మాన్ని దెబ్బతీసి వృద్ధాప్య లక్షణాలు ముందే కనిపించేలా చేస్తుంది.
జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా చర్మం నిస్సత్తువగా మారి ముడతలు త్వరగా వస్తాయి.
అధికంగా ఉప్పు ఉన్న ఆహారాలు తినడం వల్ల చర్మంలో నీరు తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం పొడిబారి వయసు ఎక్కువగా కనిపిస్తుంది.
సాఫ్ట్ డ్రింక్స్ , సోడా వంటి పానీయాలు చర్మానికి హానికరం. ఇవి శరీరంలో టాక్సిన్స్ పెంచి చర్మాన్ని వృద్ధాప్యానికి గురి చేస్తాయి.
అల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల ముడతలు, గీతలు త్వరగా ఏర్పడతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతీసి వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి.
కాఫీ ఎక్కువగా తాగడం కూడా చర్మానికి మంచిది కాదు. ఇది నీరసం కలిగించి చర్మం ముడతలు పడేలా చేస్తుంది.