తెలుగు రాష్ట్రాల్లో నేడు వాతావరణం మారబోతోంది. ఐఎండి నివేదిక ప్రకారం పలు చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల ఉక్కపోత ఉండవచ్చు.
హైదరాబాద్ మెట్ సెంటర్ ప్రకారం నేడు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలి గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. చెట్ల కింద లేదా కరెంటు స్తంభాల వద్ద ఉండకండి.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. అయితే ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది, నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి.
నేషనల్ వెదర్ ఫోర్కాస్టింగ్ సెంటర్ ప్రకారం బంగాళాఖాతంలో గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చు.
నేడు గరిష్ట ఉష్ణోగ్రతలు 37°C నుండి 40°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి.