హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతం. సాయంత్రం 40-50 kmph వేగంతో గాలులు, పిడుగులతో కూడిన జల్లులు పడవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 38°C-40°C.
తెలంగాణలో ఉగ్రరూపం దాల్చనున్న వాతావరణం. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన (Hailstorm) కురిసే ఛాన్స్. ఆరెంజ్ అలర్ట్ జారీ.
ఏపీ కోస్తా తీరంలో తీవ్రమైన ఉక్కపోత. విశాఖ, విజయవాడలో 35°C దాటనున్న ఎండలు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన.
రాయలసీమలో నిప్పుల కొలిమి! కర్నూలు, తిరుపతిలో 40°C మించనున్న ఉష్ణోగ్రతలు. వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మధ్యాహ్నం 12 - 4 గంటల మధ్య బయటకు రావొద్దు. వర్షం పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకండి. తగిన జాగ్రత్తలు పాటించండి.