అత‌ని వ‌ల్ల న‌ర‌కం చూశానంటున్న మెగా కోడ‌లు

31st March 2026

White Scribbled Underline

తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ లావ‌ణ్య త్రిపాఠి సుప‌రిచితురాలే.

అందాల రాక్ష‌సిగా పేరు తెచ్చుకున్న లావ‌ణ్య త‌న జీవితంలో ఎన్నో క‌ష్టాలు పడిన‌ట్టు చెప్తోంది.

ఉత్త‌రాఖండ్ నుంచి వ‌చ్చిన ఈ బ్యూటీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండ‌స్ట్రీలో నెగ్గుకొచ్చింది.

ప‌దేళ్ల కింద‌ట కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఇచ్చిన ఆఫ‌ర్ ను రిజెక్ట్ చేసిన లావ‌ణ్య దాని వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు ప‌డిన‌ట్టు చెప్పింది.

ప్రాజెక్టు రిజెక్ట్ చేసినందుకు ఆ డైరెక్ట‌ర్ ఈగోకు వెళ్లి త‌న‌పై లీగ‌ల్ కేసులు పెట్టి, మీడియాలో ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేశాడ‌ట‌.

ఆ క‌ష్టాల‌ను క‌నీసం కుటుంబానికి కూడా చెప్ప‌కుండానే ఎదుర్కొన్న‌ట్టు లావ‌ణ్య పేర్కొంది.

మాన‌సిక ఒత్తిడితో న‌ర‌కం చూసిన‌ప్ప‌టికీ, లైఫ్ లో ముందుకెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్టు లావ‌ణ్య చెప్పుకొచ్చింది.

మెగా హీరో వ‌రుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లావ‌ణ్య‌, వాయువ్ అనే పిల్లాడికి జ‌న్మనిచ్చింది.

ప్ర‌స్తుతం ఓ వైపు కుటుంబ బాధ్య‌త‌ల‌తో పాటూ, మ‌రోవైపు కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ లావ‌ణ్య ముందుకెళ్తుంది.