వీకెండ్ ట్రిప్‌కు బెస్ట్! తెలంగాణలో తెలియని అద్భుత ప్రదేశాలు..

27th March 2026

White Scribbled Underline

తెలంగాణలో చాలా మంది చూసే ప్రముఖ టూరిస్ట్ ప్లేస్‌లతో పాటు ఇంకా చాలా అందమైన హిడెన్ స్పాట్స్ ఉన్నాయి. ప్రకృతి, చరిత్ర, ప్రశాంత వాతావరణం ఇష్టపడే వారికి ఇవి అద్భుతమైన ఎంపికలు.

పోచేరా జలపాతం ప్రకృతి ప్రేమికులకు చాలా నచ్చే ప్రదేశం. అడవుల మధ్య ఉన్న ఈ జలపాతం ప్రశాంతంగా, అందంగా ఉంటుంది.

బోగత జలపాతం తెలంగాణలోని హిడెన్ వండర్లలో ఒకటి. వర్షాకాలంలో ఇక్కడి నీటి ప్రవాహం మరింత అందంగా కనిపిస్తుంది. దీని నయాగరా ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు.

కిన్నెరసాని అటవీ ప్రాంతం కూడా చాలా మంది తెలియని అందమైన ప్రదేశం. సరస్సు, అడవులు, పచ్చని వాతావరణం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సమ్మర్ సీజన్లో అడ్వెంచర్స్ ట్రిప్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

రామప్ప సరస్సు చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెగ్యులర్ లైఫ్ కి దూరంగా, ఎక్కువ రద్దీ లేకుండా రిలాక్స్ కావడానికి ఇది మంచి ప్రదేశం.

కొంతమంది మాత్రమే వెళ్లే లక్నవరం సరస్సు కూడా హిడెన్ టూరిస్ట్ స్పాట్‌లలో ఒకటి. ప్రకృతి మధ్యలో ఇమిడిపోయి వంతెనలు, నీరు, పచ్చదనం కలిసి చాలా అందంగా కనిపిస్తాయి.

అడ్వెంచర్స్ ట్రిప్ కావాలి అనుకునే వారికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచి ఎంపిక. ప్రకృతి మధ్యలో టైమ్ గడపాలనుకునేవారికి ఇది అద్భుతమైన ప్రదేశం. పిల్లలు ముఖ్యంగా ఈ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తారు.

ఈ హిడెన్ టూరిస్ట్ ప్రదేశాలు ప్రకృతి అందాలను దగ్గరగా అనుభవించే అవకాశం ఇస్తాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో గడపడానికి, వీకెండ్ ట్రిప్‌కు ఇవి సరైన ప్లేస్‌లు.