పానకం, వడపప్పు కేవలం సంప్రదాయం కాదు.. మీ ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తుంది!

27th March 2026

White Scribbled Underline

శ్రీరామ నవమి సందర్భంగా పానకం, వడపప్పు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం సంప్రదాయం కాదు… దీనికి బలమైన సైంటిఫిక్ కారణం ఉంది.

శ్రీరామ నవమి సాధారణంగా ఎండాకాలంలో వస్తుంది. ఈ సమయంలో శరీరం వేడిని అధికంగా గ్రహిస్తుంది. అందుకే శరీరాన్ని చల్లబరచే నైవేద్యాలు పెడతారు.

పానకంలో బెల్లం ఉంటుంది. బెల్లం నేచురల్ గ్లూకోజ్ సోర్స్. ఇది శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది మరియు డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

పానకంలో మిరియాలు, యాలకులు వేస్తారు. ఇవి డైజెషన్ మెరుగుపరుస్తాయి, బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తాయి. ఇది ఒక నేచురల్ కూలింగ్ డ్రింక్‌లా పనిచేస్తుంది.

వడపప్పు అంటే నానబెట్టిన పచ్చపప్పు. ఇది లైట్ ఫుడ్. వేసవిలో హేవీ ఫుడ్ తినడం కష్టం కావడంతో తేలికైన, హెల్తీ ఆహారం ఇస్తారు.

పచ్చపప్పులో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి, కానీ వేడి పెంచవు. అందుకే వేసవిలో ఇది బెటర్ ఎంపిక.

ఆయుర్వేదం ప్రకారం పానకం పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. వడపప్పు శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది. ఈ కాంబినేషన్ హీట్ స్ట్రోక్ రిస్క్ తగ్గిస్తుంది.