మార్చి 15-20 వరకు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) వెల్లడించింది.
హైదరాబాద్‌తో సహా 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రానున్న ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాయలసీమలో మార్చి 17 నుండి 2–3°C తగ్గే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీ తీరంలో అలల ఉధృతి సాధారణంగా ఉంటుంది. మత్స్యకారులు తాజా హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి.
NCMRWF మధ్యస్థాయి అంచనాల ప్రకారం.. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.