కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తక్కువ టైమ్ లోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
లక్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన శృతి, ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించింది.
అయితే శృతి ఇప్పటి వరకు ఎంతోమంది రిలేషన్షిప్ ను మెయిన్టెయిన్ చేసింది.
3 సినిమా టైమ్ లో శృతి, ధనుష్ కు కనెక్ట్ అయిందని వార్తలొచ్చాయి. కానీ తర్వాత అవి పుకార్లే అని తేలాయి.
ప్రేమమ్ మూవీ టైమ్ లో నాగ చైతన్యతో కూడా లవ్ లో ఉన్నట్టు రూమర్లు వచ్చాయి.
2014లో క్రికెటర్ సురేష్ రైనాతో డేటింగ్ చేస్తుందని వార్తలొచ్చాయి. వారిద్దరూ ఓ పార్టీలో కలవడం వల్ల ఈ వార్తలు ప్రచారమయ్యాయి.
లండన్ కు చెందిన మైఖేల్ కోర్సలేతో శృతి చాలా కాలం పాటూ రిలేషన్ లో ఉంది. 2019 ఏప్రిల్ లో ఇద్దరూ విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు.
తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికతో డేటింగ్ చేస్తున్నట్టు చెప్పిన శృతి, అతన్నుంచి కూడా విడిపోయి ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది.