జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు సినిమాలతో కూడా బిజీగా ఉంది జాన్వీ.
తనకెప్పుడు చిరాకుగా అనిపించినా వేడినీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటానని ఫ్రెష్ అవుతానని చెప్తోంది జాన్వీ.
పాలు, మీగడ, తేనె, పెరుగు లాంటి సహజమైన ఉత్పత్తులనే తన ముఖానికి ఎక్కువగా వాడటానికి ఇష్టపడతానని జాన్వీ చెప్తోంది.