ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైనట్టే. తీపి రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువగా ఉండటంతో మామిడి పండ్లు చాలా మందికి ఇష్టమైనవి.
మామిడి మిల్క్‌షేక్ వేసవిలో తాగడానికి మంచి పానీయం. మామిడి ముక్కలు, పాలు, కొద్దిగా చక్కెర కలిపి బ్లెండ్ చేస్తే రుచికరమైన డ్రింక్ సిద్ధమవుతుంది.
మామిడి పన్నా కూడా వేసవిలో ఎంతో ప్రసిద్ధి చెందిన పానీయం. పచ్చి మామిడి తొక్కతోసి మరిగించి దానిలో జీలకర్ర, ఉప్పు, చక్కెర కలిపితే శరీరానికి చల్లదనం ఇచ్చే సూపర్ డ్రింక్ రెడీ అవుతుంది.
ఈ సీజన్‌లో డైటింగ్ చేసే వారికి మామిడి సలాడ్ మంచి ఎంపికగా ఉంటుంది. మీరు తీసుకునే సలాడ్స్‌లో పచ్చి మామిడి తురుము కలిపితే రుచి పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
మామిడి పాయసం కూడా ప్రత్యేకమైన వంటకం. మామిడి పండు గుజ్జు, సగ్గుబియ్యం ,పాలు, బెల్లం కలిపి తయారు చేస్తే మామిడి పాయసం చాలా రుచిగా ఉంటుంది.
మామిడి ఐస్‌క్రీమ్ కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మామిడి గుజ్జు, క్రీమ్, కొద్దిగా చక్కెర కలిపి ఫ్రీజర్‌లో ఉంచితే రుచికరమైన ఐస్‌క్రీమ్ సిద్ధమవుతుంది.
మామిడి చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. పచ్చి మామిడి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు కలిపి రుబ్బితే అన్నం లేదా దోసెలతో తినడానికి మంచి సైడ్ డిష్ అవుతుంది.
వేసవిలో మామిడి పండ్లతో ఇలా రకరకాల వంటకాలు తయారు చేసుకుని రుచి ఆస్వాదించవచ్చు. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు తాజాదనాన్ని కూడా అందిస్తాయి.