మార్చి నెలలో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి.
ఓజి లాంటి స్టైలిష్ హిట్ తర్వాత పవన్ నుంచి వస్తున్న ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో ఈ మూవీని స్పెషల్ గా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.
మార్చి 26న రిలీజ్ కానున్న ఈ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఆల్రెడీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాడు.
ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని, కేవలం 20 నిమిషాల్లోనే ఆ డీల్ క్లోజ్ అయిందని హరీష్ చెప్పాడు.
కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే ఈ డీల్ జరిగినట్టు ఆయన చెప్పగా, ఓటీటీ రిలీజ్ టైమింగ్ గురించి మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది