టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లి వార్త గత వారం రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ జంటకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కూడా శుభాకాంక్షలు వచ్చిన విషయం తెలిసిందే.
మూడు రోజుల పెళ్లిగా జరుగుతున్న ఈ తంతులో హల్దీ, మెహందీ, సంగీత్ తో పాటూ రెండు సంప్రదాయాల్లో పెళ్లి కూడా ఉంది.
కాగా ఇవాళ ఫిబ్రవరి 26 ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ తాళి కట్టి, ఇద్దరూ ఒక్కటయ్యారు.
ఇవాళ సాయంత్రం కొడవ సంప్రదాయంలో వీరిద్దరికీ మరోసారి పెళ్లి జరగబోతుంది.
వీరిద్దరి పెళ్లి సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి వేడుకలు అత్యంత గోప్యంగా, కుటుంబ సభ్యులు-సన్నిహితుల మధ్యే జరుగుతున్నాయి.
వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.