అర్ధరాత్రి ఈ పని చేస్తే… ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

20th February 2026

White Scribbled Underline

రాత్రి 12 తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా డబ్బు లావాదేవీలు ఆ సమయంలో చేయకూడదని సూచిస్తారు.

అర్ధరాత్రి తర్వాత డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం శుభం కాదని నమ్మకం ఉంది. ఇలా చేస్తే సంపాదన నిలవదని అంటారు.

అలాగే ఇంట్లో డబ్బు లెక్కించడం కూడా ఆ సమయానికి మంచిది కాదని భావిస్తారు. సంపదకు నష్టమవుతుందని పెద్దల మాట.

రాత్రి ఆలస్యంగా ఖర్చుల గురించి గొడవలు పడటం కూడా మంచిది కాదు. ఇది ఇంటి శాంతిని దెబ్బతీస్తుందని చెబుతారు.

ఇంకొంతమంది ఆ సమయంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం నివారించాలని సూచిస్తారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయని నమ్మకం.

అందుకే ముఖ్యమైన డబ్బు వ్యవహారాలు పగటి పూటే ముగించుకోవడం మంచిదని సూచిస్తారు. సక్రమమైన సమయాన్ని పాటించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కాపాడుకోవచ్చు.

అర్ధరాత్రి తర్వాత దానం చేయడం లేదా వస్తువులు ఇవ్వడం నివారించాలి ప్రత్యేకంగా బియ్యం, ఉప్పు, డబ్బు వంటి అవసరమైన వస్తువులు రాత్రి 12 తర్వాత బయటకు ఇవ్వడం మంచిది కాదని నమ్మకం.

ఆ సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు చేయడం తగ్గించాలి పాత నమ్మకాల ప్రకారం మాత్రమే కాదు, ప్రాక్టికల్‌గా కూడా అర్ధరాత్రి సమయంలో తొందరపాటుగా ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

రాత్రి ఆలస్యంగా కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు పెట్టుబడులు పెట్టడం, అప్పు తీసుకోవడం,ఉదయం ప్రశాంతమైన మనసుతో నిర్ణయం తీసుకుంటే మంచిది.