మ‌రో పెళ్లికి రెడీ అంటున్న సింగ‌ర్ క‌మ్ హీరోయిన్

19th February 2026

White Scribbled Underline

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న మ‌మ‌తా మోహ‌న్‌దాస్ త‌క్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది.

తెలుగులో య‌మ‌దొంగ, రుద్రాంగి, కృష్ణార్జున లాంటి సినిమాల్లో న‌టించిన ఆమె.. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టించి మెప్పించింది.

రెండు సార్లు క్యాన్స‌ర్ బారిన ప‌డి, దాంతో పోరాడి బ‌య‌ట‌ప‌డిన మ‌మ‌తా ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అవాల‌ని చూస్తోంది.

రీసెంట్ గా మ‌మ‌తా ప్రేమ‌, పెళ్లిపై మాట్లాడింది. తాను ఓ మ‌ల‌యాళ  న‌టుడితో డేటింగ్ కు వెళ్లాన‌ని, కానీ అత‌నికి అప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందని చెప్పింది.

అత‌ను ఆ అమ్మాయి మ‌న‌సుని బ‌ద్ద‌లు చేశాడ‌ని తెలిసి బాధేసింద‌ని చెప్పిన మ‌మ‌తా త‌న‌కు పెళ్లిపై న‌మ్మ‌కముంద‌ని, అది ఎప్ప‌టికీ పోద‌ని చెప్పింది.

మ‌రో పెళ్లికి సిద్ధ‌మ‌ని చెప్తున్న మ‌మ‌తా 2011లో బ‌హ్రెయిన్ కు చెందిన బిజినెస్‌మ్యాన్ ప్ర‌జిత్ పద్మ‌నాభ‌న్ ను పెళ్లి చేసుకోగా, 2012లో వారిద్ద‌రూ విడాకులు తీసుకుని విడిపోయారు.

వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లు తనను మరింత బలంగా మార్చాయని మమతా చెబుతోంది.

జీవిత భాగస్వామి విషయంలో ఈసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, పరస్పర గౌరవం ముఖ్యమని పేర్కొంది.

కెరీర్‌, వ్యక్తిగత జీవితం రెండింటినీ సమతౌల్యంగా కొనసాగించాలనేది ఇప్పుడు తన ప్రధాన లక్ష్యమని తెలిపింది.

ఫాలో అవ్వండి.

ట్రావెల్ లవర్స్ కోసం అత్యుత్తమ టెక్ గ్యాడ్జెట్స్ ఇవే

ఫిబ్రవరి 19, 2025 గురువారం రాశిఫలాలు