విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫిబ్రవరి 26న జరగనున్న సంగతి తెలిసిందే.
ఉదయ్‌పూర్ లోని ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగనుందని ఇప్పటికే వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే విజయ్, రష్మికల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతేడాది అక్టోబర్ లో విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని ఎన్నో వార్తలు రాగా, దీనిపై అటు రష్మిక కానీ, విజయ్ కానీ స్పందించలేదు.
ఫిబ్రవరి 26న జరిగే వీరి పెళ్లికి ఉదయ్‌పూర్ లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వీరి పెళ్లి వీడియో రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని వార్తలొస్తుండగా, ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
ఇటు విజయ్, అటు రష్మిక ఇద్దరూ తమ పెళ్లికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రైవేట్ గా ఉంచాలని డిసైడ్ అయ్యారట.
ఈ పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ నుండి అతికొద్ది మంది సన్నిహితులు మరియు ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.
ఫిబ్రవరి 17 – ఈ రోజు రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్ జాకెట్ రేటెంతో తెలుసా?