మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ నాగబాబు కూతురు నిహారిక తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది.
నాగ శౌర్య హీరోగా నటించిన ఒక మనసు సినిమాతో నిహారిక వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.
ఆ సినిమా అనుకున్న ఫలితాల్ని అందుకోకపోవడంతో హీరోయిన్ గా నిహారిక తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు.
హీరోయిన్ గా అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయినా నిర్మాతగా మాత్రం నిహారిక రాణిస్తోంది.
కమిటీ కుర్రోళ్లు మూవీతో సినీ నిర్మాతగా కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఆ సినిమాతో మంచి హిట్‌ను అందుకోవడమే కాకుండా గద్దర్ అవార్డును కూడా అందుకుంది.
ప్రస్తుతం నిహారిక నిర్మాతగా రెండో సినిమాను సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ అనే లేడీ డైరెక్టర్ తో చేస్తుంది. మరి ఈ సినిమా కూడా కమిటీ కుర్రోళ్లు లాగా నిహారికకు మంచి పేరు తెస్తుందేమో చూడాలి.