సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజా సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.
ప్రభాస్ మార్కెట్ తో మంచి ఓపెనింగ్స్, ఓ మోస్తరు కలెక్షన్లను అందుకున్న రాజా సాబ్ థియేటర్ రన్ ను ముగించుకుని ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ఈ సినిమా హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా, ది రాజా సాబ్ సినిమా ఫిబ్రవరి 6 నుంచి ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు.
థియేట్రికల్ రన్ తర్వాత నారీ నారీ నడుమ మురారి ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.