జోక్ కాదు – నిజం.. పెళ్లి తర్వాత బీపీ వచ్చింది” అనే మాటను చాలామంది సరదాగా తీసుకుంటారు. కానీ తాజాగా వచ్చిన పరిశోధనల ప్రకారం ఇది కేవలం జోక్ కాదు, నిజ జీవితంలో కనిపించే సమస్యగా మారింది.

7:00AM

ప్రపంచవ్యాప్తంగా చేసిన విశ్లేషణ ఇటీవలి అధ్యయనాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ (American Heart Association Journal)లో ప్రచురించారు. ఈ పరిశోధనను ఇంగ్లండ్ (England), ఇండియా (India), చైనా (China), యునైటెడ్ స్టేట్స్ (United States) దేశాల్లో నిర్వహించారు. మొత్తం 30,000 జంటల ఆరోగ్య వివరాలను విశ్లేషించి ఆసక్తికర ఫలితాలు పొందారు.

జంటల్లో బీపీ జీవిత భాగస్వామిలో ఒకరికి రక్తపోటు (Blood Pressure) ఉంటే, మరొకరికి కూడా ఆ సమస్య వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. ఇంగ్లండ్‌లో 47% జంటలు, అమెరికాలో 37.9%, చైనాలో 20.8%, భారతదేశంలో 19.8% జంటలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

జీవనశైలి ప్రభావం దంపతుల మధ్య భావోద్వేగ ఒత్తిడి, అసమతుల్య జీవనశైలి, పనిజీవిత సమతుల్యం లేకపోవడం వంటి అంశాలు బీపీ పెరగడానికి కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఇండియా, చైనా పరిస్థితి విశేషం ఇండియా, చైనా దేశాల్లో కుటుంబ విలువలు గట్టిగా ఉండటంతో మానసిక ఒత్తిడి, ఆందోళనల ప్రభావం ఆరోగ్యంపై ఎక్కువగా పడుతోందని అధ్యయనంలో తేలింది.

నియంత్రణ సాధ్యమే నియమిత వ్యాయామం, సత్ఫలితమైన ఆహారం, పరస్పర అవగాహనతో బీపీని నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. భార్యభర్తలు ఒకరి ఆరోగ్యాన్ని మరొకరు పర్యవేక్షించటం, సానుకూల వాతావరణం కల్పించటం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.