కొబ్బరి నూనెకు పసుపు పొడిని కలిపి పళ్ళు శుభ్రం చేయడం ఒక పాతకాలపు ఇంటి చిట్కాగా చాలామంది ఉపయోగిస్తున్నారు.
కొబ్బరి నూనెలో ఉన్న సహజ గుణాలు నోటిలోని చెడు బాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
పసుపులో ఉన్న సహజ ఔషధ లక్షణాలు పళ్ళ చిగుళ్ల వాపు, రక్తస్రావం తగ్గించడంలో ఉపయోగపడతాయి.
ఈ రెండింటిని కలిపి మృదువుగా పళ్ళపై రుద్దితే పళ్ళపై పేరుకున్న మురికి, పేరుకున్న పాచి క్రమంగా తగ్గుతాయి.
అయితే ఎక్కువ పసుపు వాడితే పళ్ళకు పసుపు మచ్చలు పడే అవకాశం ఉండడంతో చాలా తక్కువ మోతాదులోనే వాడాలని సూచన.అలాగే ఈ మిశ్రమంలో కాస్త టూత్ పేస్ట్ కూడా కలిపితే మంచిది.
ఈ చిట్కాను వారానికి రెండు మూడు సార్లు పాటిస్తే, నోటి ఆరోగ్యం మెరుగవుతుంది.