ఉగాది ప్రత్యేకత ఏంటి? ఈ పండుగ వెనుక ఉన్న కథలు, విశేషాలు

13th March 2026

White Scribbled Underline

ఉగాది అంటే తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఇది తెలుగు నూతన సంవత్సరానికి ప్రారంభంగా భావించబడే శుభదినం కాబట్టి ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రజలు పంచాంగ శ్రవణం చేసి రాశిఫలాలు, గ్రహస్థితుల గురించి తెలుసుకుంటారు.

పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు ఇదే అని చెప్పబడుతుంది. అందుకే ఈ రోజును కొత్త యుగానికి ఆరంభంగా భావించి “యుగాది” అనే పేరు వచ్చింది.

మరో కథనం ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడట. శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందించాడని పురాణాలు చెబుతాయి.

ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా ఈ కాలం కొత్త సంవత్సరానికి సంకేతంగా భావిస్తారు. ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట ఈ రోజున సూర్యకిరణాల ప్రభావంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ప్రకృతి పరంగా కూడా ఉగాది ప్రత్యేకమైన సమయం. శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే సమయంలో చెట్లు కొత్త చిగుళ్లతో పచ్చగా మారుతాయి.

ఈ మార్పుల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉగాది పచ్చడి తినే సంప్రదాయం ఉంది. జీవితం లోని తీపి, చేదు అనుభవాలను సమంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది.

CLICK HERE