టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో పుష్ప2 లో తన నటనకు గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు.
బన్నీ అవార్డు అందుకున్నందుకు మృణాల్ ఫ్లవర్ బొకే పంపుతూ శుభాకాంక్షల్ని తెలుపుతూ, మీ ప్రతి పెర్ఫార్మెన్స్ లో కనిపించే డెడికేషన్ నిజంగా ఇన్సిపిరేషన్ అని చెప్పింది.
మృణాల్ పంపిన బొకే, నోట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ, ఎప్పటికైనా మీతో కలిసి వర్క్ చేయాలని ఆశిస్తున్నానంటూ పోస్ట్ చేశాడు బన్నీ.
ఈ పోస్ట్ తో సోషల్ మీడియాలో వీరిద్దరి కాంబినేషన్ పై డిస్కషన్ మొదలైంది. బన్నీ, మృణాల్ ఇప్పటివరకు కలిసి వర్క్ చేసింది లేదు.
స్వయంగా బన్నీనే మృణాల్ తో వర్క్ చేయాలనుందని చెప్పడంతో ఫ్యూచర్ లో వీరిద్దరూ కలిసి నటించే అవకాశమొస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉంటే, మృణాల్ డెకాయిట్ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.