ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లను సరిగా పాటించకపోవడం వల్ల విటమిన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విటమిన్ B12 లోపం చాలా మందిలో ఉంది. ఈ విటమిన్ మెదడు, నరాలు, రక్తకణాల తయారీకి కీలకం. దీని లోపం వల్ల అలసట, నీరసం, ఏకాగ్రత లోపం, స్ట్రెస్, యాంగ్జైటీ  వంటి సమస్యలు వస్తాయి.

విటమిన్ B12 లోపం వల్ల కలిగే ఇబ్బందులు ఈ విటమిన్ సరైన మోతాదులో లేకపోతే శరీరంలోని ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా రక్తహీనత, మెదడు పనితీరులో మార్పులు, శరీరానికి తగిన శక్తి లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌లో ఈ విటమిన్ లభిస్తుంది. కానీ వెజిటేరియన్స్ కూడా కొన్ని ఆహారాల ద్వారా దీన్ని పొందవచ్చు.

వెజిటేరియన్స్ కోసం B12 వెజిటేరియన్ ఆహారాల్లో పనీర్ (Paneer) ప్రధానమైనది. ఇందులో విటమిన్ B12 తో పాటు ప్రోటీన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాలు, ఎముకలకు బలం ఇస్తుంది. అయితే పనీర్‌ని ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే ఆ ప్రక్రియలో విటమిన్ B12 తగ్గిపోతుంది. కాస్త రోస్ట్ చేసి సలాడ్ లేదా కర్రీలలో కలిపి తినడం మంచిది.

విటమిన్ B12 సమృద్ధిగా లభించే ఆహారాన్ని ప్రతిరోజూ ఆహారంలో చేర్చడం ద్వారా శరీరంలో శక్తి, మెదడు చురుకుదనం, రక్తపోటు స్థిరంగా ఉండేలా చూసుకోవచ్చు.

A classic bildungsroman of Charles, a young Black man from a tough Miami neighborhood, as he navigates his identity.

పెరుగులోని ప్రయోజనాలు పెరుగు (Curd) కూడా విటమిన్ B12 కు మంచి మూలం. ఇది జీర్ణశక్తిని పెంచడమే కాకుండా ప్రోబయాటిక్స్‌ను అందిస్తుంది. అన్నంతో పాటు పెరుగు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే షుగర్ యాడ్ చేసిన యోగర్ట్ (Flavoured Yogurt) తీసుకోవడం మానుకోవడం మంచిది.