ఉపవాసాల నెల కార్తీక మాసం (Karthika Masam) మొదలవడంతో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. చికెన్, మటన్, ఎగ్స్ లాంటి వంటకాలు పూర్తిగా మానేసి ఉపవాసాలు చేస్తారు. కానీ ఈ సమయంలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ఎలా అందుతుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
పప్పులు.. మినుములు, పెసరపప్పు, కందిపప్పు లాంటి పప్పుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండె సంబంధిత సమస్యలు, షుగర్, అధిక బరువు వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.
కిడ్నీ బీన్స్ కిడ్నీ బీన్స్ (Kidney Beans) మొదలైన రకరకాల బీన్స్‌లలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్, ఐరన్, ఫోలేట్, పొటాషియం లాంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని వండుకుని తింటే రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.
పచ్చి బఠానీలు ఒక కప్పు పచ్చి బఠానీల్లో (Green Peas) దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి థయామిన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి వంటి పోషకాలతో నిండుంటాయి. వీటిని స్నాక్స్‌గా లేదా కర్రీగా తినవచ్చు.
నట్స్, సీడ్స్ & కూరగాయలు బాదం, వేరుశెనగలు, చియా సీడ్స్ లాంటి వాటిలో ప్రోటీన్‌తో పాటు హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అలాగే పాలకూర (Spinach), బ్రకోలీ (Broccoli), బంగాళాదుంపలు, చిలగడదుంపల్లో కూడా కొంత ప్రోటీన్ ఉంటుంది.
కాబట్టి కార్తీక మాసంలోనూ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పొందడం చాలా ఈజీ. నాన్‌వెజ్ లేకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు.