ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి అన్ హెల్దీ హ్యాబిట్స్ కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు ఒళ్ళు నొప్పులు. వయసుకు సంబంధం లేకుండా వస్తున్నయి నొప్పులకు యూరిక్ ఆసిడ్ పెరుగుదల కారణమైన విషయం చాలామందికి తెలియదు. అయితే ఈ సమస్యను ఎటువంటి కెమికల్స్ తో సంబంధం లేకుండా ఇంటి వద్దనే న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
యూరిక్ యాసిడ్: మన శరీరం ప్యూరిన్ (Purines) అనే పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది. సాధారణంగా ఇది రక్తంలో కరిగి, మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్తుంది. అయితే ఎక్కువగా రెడ్‌మీట్, సీ ఫుడ్, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయులు పెరుగుతాయి.
సైడ్ ఎఫెక్ట్స్: శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గౌట్, కీళ్ల నొప్పులు, కిడ్నీ రాళ్లు, హైబీపీ, షుగర్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తాయి. కీళ్లలో స్ఫటికాలు పేరుకోవడం వల్ల తీవ్రమైన నొప్పులు కూడా రావచ్చు. కొన్ని సహజమైన ఫుడ్స్ ని మన రోజువారీ డైట్లో చేర్చితే యూరిక్ యాసిడ్ సమస్యను ఈజీగా తగ్గించవచ్చు.
చెర్రీస్: చెర్రీస్‌లో ఉండే ఆంతోసియానిన్స్ (Anthocyanins) యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti Inflammatory) లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి గౌట్ నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. యూరిక్ యాసిడ్‌ని మూత్రం ద్వారా బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
సొరకాయ: నీటి శాతం ఎక్కువ కలిగిన సొరకాయ (Bottle gaurd) రోజూ జ్యూస్ రూపంలో పరగడుపున తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అంతేకాకుండా ఇది వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ చేస్తుంది.
కొరియాండర్ టీ: ముందు రోజు నానబెట్టిన ధనియాలను బాగా మరిగించి చల్లారిన తర్వాత కొరియాండర్ టీ (Coriander Water) రూపంలో తీసుకుంటే అది యూరిక్ యాసిడ్‌ను డెల్యూట్ చేస్తుంది. రోజూ గోరువెచ్చగా తాగితే కీళ్ల మంట తగ్గుతుంది.