ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి శెట్టి.
మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటూ బ్లాక్ బస్టర్ ను కూడా ఖాతాలో వేసుకుంది.
ఉప్పెన హిట్ అవడంతో అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి.
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హిట్స్ ను అందుకున్న కృతికి తర్వాత మాత్రం సక్సెస్ దక్కలేదు.
అమ్మడు ఎన్ని సినిమాలు చేస్తున్నా అవన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపులుగానే మిగులుతున్నాయి.
ప్రస్తుతం కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన కృతికి అక్కడ బాగానే ఆఫర్లు వస్తున్నాయి కానీ తెలుగులో మాత్రం ఛాన్సులు రావడం లేదు.