హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 39°C వరకు నమోదు. సాయంత్రం వేళల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడవచ్చు.
తెలంగాణలో నేడు ఆరెంజ్ అలెర్ట్. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో ఎండ తీవ్రత అధికం. పలు చోట్ల 44°C దాటే అవకాశం ఉంది.
భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సూచన.
ఏపీలో మండుతున్న భానుడు. నేడు 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్.
ఎండలతో పాటు మన్యం, అల్లూరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్.
కడప, అనంతపురం జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ప్రజలు ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు.
వడదెబ్బ తగలకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగండి. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండకండి. సురక్షితంగా ఉండండి!