లాంగ్ హెయిర్ మెయింటెనెన్స్ చాలా మందికి ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు సమస్యలు పెరుగుతాయి.
వారానికి రెండుసార్లు కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయండి. ఇది కుదుళ్లకు బలాన్ని ఇచ్చి జుట్టు పెరిగేలా చేస్తుంది.
నూనెతో మసాజ్ చేయండి
రోజూ షాంపూ పెడితే జుట్టులోని సహజత్వం పోతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.
రోజూ తలస్నానం వద్దు
షాంపూ తర్వాత కండిషనర్ వాడితే జుట్టు సిల్కీగా ఉంటుంది. ఇది జుట్టు చిట్లిపోకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.
కండిషనర్ మర్చిపోకండి
జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. పూర్తిగా ఆరిన తర్వాతే వెడల్పాటి దువ్వెనతో నిదానంగా దువ్వుకోవాలి.
తడి జుట్టుపై జాగ్రత్త
జుట్టు చివర్లు చిట్లిపోతే ఎదుగుదల ఆగుతుంది. మూడు నెలలకోసారి కొద్దిగా ట్రిమ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
చివర్లు కత్తిరించండి
కెమికల్స్ కాకుండా మందార, ఉసిరి, కలబంద, మెంతులు వంటి సహజ ప్యాక్‌లు వాడండి. ఇవి జుట్టుకు మంచి మెరుపును, బలాన్ని ఇస్తాయి.
మందార, ఉసిరి మేలు
మనం తినే ఆహారమే జుట్టుకు బలం. ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది.
మంచి తిండి.. మంచి జుట్టు
హెయిర్ డ్రైయర్స్, స్ట్రైటెనర్స్ అతిగా వాడకండి. ఆ వేడి జుట్టును నిర్జీవంగా మార్చేస్తుంది.
వేడికి దూరంగా ఉంచండి
జుట్టును మరీ టైట్‌గా కట్టడం వల్ల కుదుళ్లు దెబ్బతింటాయి. వదులుగా అల్లుకోవడం జుట్టుకు చాలా మంచిది.
బిగుతుగా ముడి వేయకండి