రొయ్యలు చాలా మందికి ఇష్టమైన ఆహారం. కానీ వాటిని వండే ముందు సరైన విధంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
రొయ్యల వెనుక భాగంలో కనిపించే నల్ల గీతను చాలామంది పట్టించుకోరు.అదే రొయ్యల నరం లేదా జీర్ణాశయం. ఆ నరంలో రొయ్యలు తిన్న ఆహారం, మట్టి, ఇసుక, వ్యర్థాలు ఉంటాయి.
నరం తీసేయకుండా రొయ్యలు వండితే వంటలో చేదు రుచి రావచ్చు. బాగా ఉడికించినా కూడా నరంలోని మలినాలు పూర్తిగా పోవు. అలెర్జీ ఉన్నవారికి కడుపు నొప్పి, వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
రొయ్యలను ముందుగా నీటిలో బాగా కడగాలి. పెంకు తీసి వెనుక భాగంలో చిన్నగా చీలిక చేసి నరాన్ని తొలగించాలి. నరం తొలగించకుండా రొయ్యలు తినడం మంచిది కాదు.
నరం తీసేసిన తర్వాత వండితే రుచి మెరుగ్గా ఉంటుంది. నీట్ గా శుభ్రం చేసిన రొయ్యలు వండుకొని తింటేనే ఆరోగ్యం లేకపోతే అనవసరమైన డైజేషన్ ఇష్యూస్ వస్తాయి.