మనిషి జీవితంలో అత్యంత విలువైనది సమయం దాన్ని సరిగ్గా వినియోగించగలిగితే విజయాలు, సంతోషం రెండూ సులభంగా దక్కుతాయి. అయితే ఆధునిక ఉద్యోగ పద్ధతుల్లో సమయాన్ని సమతుల్యం చేయడం చాలా మందికి కష్టంగా మారింది. పని, కుటుంబం, వ్యక్తిగత జీవితం – ఈ మూడు మధ్య సమతుల్యం దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నది ట్రిపుల్-8 రూల్

ఈ నియమం ప్రకారం రోజులో ఉన్న 24 గంటలను మూడు భాగాలుగా విభజించాలి. అందులో 8 గంటలు ఉద్యోగానికి, 8 గంటలు వ్యక్తిగత మరియు కుటుంబ జీవితానికి, 8 గంటలు నిద్రకు కేటాయించాలి. ఇలా సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా జీవితం పట్ల ఉత్సాహం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Cloud Banner

ఉద్యోగం మాత్రమే కాదు, మనసుకు నచ్చిన పనులకు, కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వడం అవసరం. ఇది మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. నాణ్యమైన నిద్ర ద్వారా శరీరం, మెదడు రెండూ సరిగ్గా పనిచేస్తాయి. ఈ రూల్ ని క్రమంగా అలవాటు చేసుకుంటే, ప్రొడక్టివిటీ పెరిగి జీవితంలో సంతోషం, సంతులనం వస్తుంది.

ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఈ రూల్ అమలు చేయడం సులభం కాదు. అనేక అడ్డంకులు ఎదురైనా, సరైన ప్రణాళికతో (Planning) ముందుకు వెళ్తే ఈ పద్ధతిని అమలులో పెట్టడం సాధ్యమే.