ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీగా ఉన్న జీవితం గడుపుతున్నారు. ఉద్యోగం, చదువు, మొబైల్‌ఫోన్లు—ఇవన్నీ కుటుంబ సభ్యులను దూరం చేస్తున్నాయి. కానీ రోజులో ఒక్కసారైనా ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేయడం చాలా అవసరం. ఇది కేవలం తినే సమయం కాదు, మనసులు దగ్గరవడానికి అద్భుతమైన అవకాశం.
బంధాలను బలపరచే క్షణాలు భోజన సమయంలో మనం పరస్పరం మాట్లాడుకోవడం, రోజంతా జరిగిన విషయాలు పంచుకోవడం జరుగుతుంది. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం మరింత బలపడుతుంది. పరిశోధనల ప్రకారం ఫ్యామిలీ డిన్నర్ కల్చర్ (Family Dinner) ఉన్న ఇళ్లలో పిల్లలు మరింత సానుకూలంగా ఎదుగుతారని తేలింది.
పిల్లల మానసిక ఆరోగ్యానికి మేలు కుటుంబంతో భోజనం చేసే పిల్లలు ఒత్తిడికి (Stress) గురికాకుండా, ఆత్మవిశ్వాసం పెంచుకుంటారని నిపుణులు (Experts) చెబుతున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడటం వల్ల వారికి భద్రత భావన పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కుటుంబంతో తింటే జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండి, హెల్దీ హోమ్‌మేడ్ ఫుడ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
మొబైల్ ఫ్రీ సమయం ఫ్యామిలీ మీల్ టైమ్‌లో మొబైల్‌లు (Mobile phones) , టీవీ దూరంగా పెట్టడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మెదడుకు విశ్రాంతి కలిగిస్తుంది.
రోజుకు ఒక్కసారి అయినా భోజనం కుటుంబంతో కలిసి చేయడం వల్ల ప్రేమ, పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇది కుటుంబాన్ని ఏకం చేసే అందమైన అలవాటు. కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభించండి – “ఫ్యామిలీ డిన్నర్, హ్యాపీ లివింగ్!”