యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన శివానీ నగరం ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శివానీ నగరం పేరే మార్మోగిపోతుంది.
టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న శివానీకి లిటిల్ హార్ట్స్ సినిమా మంచి బ్రేక్ ను ఇచ్చింది.
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది.
1998లో హైదరాబాద్ లో పుట్టిన శివానీ చిన్నప్పటి నుంచే కూచిపూడి నేర్చుకుంది.
విల్లా మేరీ కాలేజ్ లో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన శివానీ అంతర్గత అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారగా, అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శివానీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.