తెలుగమ్మాయి అయిన అంజలి ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసేది. కానీ అమ్మడు ఇప్పుడు సినిమాలు చేయడం తగ్గించింది.
హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అంజలి కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు కూడా చేసింది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అంజలి పలు సినిమాలు చేసి మెప్పించింది.
సీతమ్మ వాకిట్లో లాంటి సినిమాలే కాకుండా గీతాంజలి, చిత్రాంగద లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది అంజలి.
గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీతో 50 సినిమాలు పూర్తి చేసుకున్న అమ్మడు ఆఖరిగా గేమ్ ఛేంజర్ మూవీతో ఆడియన్స్ ను పలకరించింది.
అంజలి ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన గీతాంజలి మూవీ అనుకున్న అంచనాల్ని అందుకోలేకపోవడంతో ఇప్పుడు కెరీర్లో స్పీడు తగ్గించింది.