8th May 2026

____________

- Saidulu

గ్రామీణ వంటింటి సూపర్ ఫుడ్ అవిశాకులు.. పోషకాలతో నిండిన ఆరోగ్య రహస్యం

అవిశాకులు మన ఇంటి దగ్గరే సులభంగా దొరికే పోషకాహార సంపద. పాతకాలం నుంచే గ్రామాల్లో వీటిని ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరగా ఉపయోగిస్తున్నారు.

అవిశి ఆకుల్లో విటమిన్-A, విటమిన్-Cతో పాటు ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో సహాయపడతాయి.

చూడటానికి మునగ ఆకుల్లా కనిపించే ఈ ఆకుకూరలు రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు కూడా వీటిని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

వేసవి కాలంలో అవిశాకులు తినడం వల్ల శరీర వేడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.

కంటి చూపు బలంగా ఉండేందుకు కూడా అవిశి ఆకులు ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న పోషకాలు కళ్ల ఆరోగ్యం కాపాడటానికి దోహదం చేస్తాయి.

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి కూడా ఈ ఆకుకూర మంచి సహజ ఆహారం. ఐరన్ అధికంగా ఉండటంతో రక్తం పెరగడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియ సరిగా జరిగేలా చేసి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో అవిశాకులు ఉపయోగపడతాయి. కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడంలో ఈ ఆకుకూర సహజ డిటాక్స్ ఫుడ్‌లా పనిచేస్తుంది. దీంతో శరీరం తేలికగా ఉండే అనుభూతి కలుగుతుంది.

అయితే అవిశాకులను మితంగా మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటే సరిపోతుందని, ఎక్కువైతే కడుపు మంట వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు.