16th June 2026

__________

- Saidulu

మెడకు హత్తుకుపోయే కంటె నెక్లెస్ డిజైన్స్ వచ్చేశాయి... ఓ లుక్కేయండి మరి!

 పెళ్లిళ్లలోనే కాదు.. సింపుల్ ఫంక్షన్లలో కూడా గ్రాండ్ లుక్ కావాలా? బరువు తక్కువగా ఉండే ఈ లైట్ వెయిట్ కంటెలు మీ కోసమే!

కేవలం 8 నుండి 10 గ్రాములలో లభించే ఈ ప్లెయిన్ కంటె చాలా క్లాసిక్‌గా ఉంటుంది. డైలీ వేర్, ఆఫీస్ వేర్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.

ప్లెయిన్ స్లీక్ కంటె

షైనింగ్ ఇష్టపడని వారి కోసం మ్యాట్ ఫినిష్ కంటెలు వచ్చాయి. ఇవి తక్కువ బరువులోనే ప్యూర్ యాంటిక్ జ్యువెలరీ లుక్‌ను ఇస్తాయి.

మ్యాట్ ఫినిషింగ్ డిజైన్స్

సన్నని కంటె పట్టీకి కింద చిన్న చిన్న ముత్యాలు వేలాడే ఈ మోడల్స్, ప్రతీ రంగు చీరపైకి ఇట్టే సెట్ అయిపోతాయి, చాలా ట్రెండీగా ఉంటాయి.

ముత్యాల హంగులు

ప్లెయిన్ కంటె మధ్యలో ఒకే ఒక కెంపు లేదా పచ్చ లాకెట్ లాగా వచ్చే ఈ డిజైన్స్ తక్కువ బడ్జెట్‌లో రిచ్ లుక్ ఇస్తాయి.

సింగిల్ స్టోన్ లాకెట్

నెక్లెస్ అంచులకు లేదా మధ్యలో చిన్న చిన్న పూల డిజైన్లు ఉండే ఈ మోడల్స్, అమ్మాయిలకు మరియు నవవధువులకు చక్కగా సరిపోతాయి.

ఫ్లోరల్ మోటిఫ్స్

గట్టిగా కాకుండా కాస్త ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఈ మోడల్స్ ధరించడానికి సౌకర్యంగా ఉంటాయి. మెడకు అస్సలు గుచ్చుకోవు.

ఫ్లెక్సిబుల్ కంటె

మోడ్రన్ డ్రెస్సులు, ఇండో-వెస్ట్రన్ లెహంగాల మీదకు వేసుకోవడానికి ఈ రోజ్ గోల్డ్ లైట్ వెయిట్ కంటెలు ఇప్పడు సూపర్ హిట్.

రోజ్ గోల్డ్ ట్రెండ్ 

తక్కువ బరువు, రీజనబుల్ ప్రైస్, మోడ్రన్ లుక్.. ఇవన్నీ కలగలిసిన లైట్ వెయిట్ కంటెలు మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిందే!