ఊరగాయలు మన ఇంటి భోజనానికి ప్రత్యేక రుచిని ఇవ్వడంతో పాటు ఎక్కువకాలం నిల్వ ఉండే ఆహారం. అయితే వాటిని ఎలా నిల్వ చేస్తామో అనేదే ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ సీసాల్లో పికిల్స్ ఉంచడం ఎందుకు ప్రమాదకరమో తెలుసుకోవడం అవసరం.
రసాయన ప్రతిక్రియలు: పికిల్స్లో ఉండే నూనె, ఉప్పు, మసాలాలు ప్లాస్టిక్‌తో రియాక్ట్ (chemical reaction) అవుతాయి. ఇది ప్లాస్టిక్ బాటిల్ నుండి హానికరమైన పదార్ధాలు (chemicals) విడుదల చేయడానికీ దారితీయవచ్చు.
రంగులో మార్పు: ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ చేసిన ఊరగాయల వాసన, రంగు మారడంతో పాటు అందులో ఉన్న పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ లో స్టోర్ చేసిన పచ్చళ్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరగా నే పాడైపోయా అవకాశం కూడా ఉంది.
ఆరోగ్యానికి ప్రమాదం: పికిల్స్లోని యాసిడ్ (ఉప్పు, ట్యాంబర్, వెనిగర్ లాంటివి) ప్లాస్టిక్‌తో రియాక్ట్ అవ్వడం వల్ల బిపిఏ (BPA) లేదా ఫ్తలేట్స్ (Phthalates) లాంటి హానికరమైన రసాయనాలు విడుదల చేయవచ్చు. ఇవి శరీరంలో హార్మోన్ వ్యవస్థను దాడి చేసే అవకాశాన్ని కలిగి ఉంటాయి.
పర్యావరణ హానికరం: ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి కూడా ముప్పుగా మారుతుంది. పికిల్స్ స్టోరేజ్‌కు ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ యూసేజ్ అనవసరంగా పెరుగుతుంది. దీని బదులు మనం ట్రెడిషనల్ గా జాడీలు లేక గాజు సీసాలు ఉపయోగిస్తే మంచిది మంచిది.. ఇవి కేమికల్ ప్రతిక్రియలకు గురికాకుండా పికిల్స్ రుచి, ఆరోగ్యం రెండింటినీ కాపాడతాయి.
పగిలిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అని చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ వాటికంటే కూడా ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసే జాడీలు, గాజు పాత్రలు ఉపయోగించడం మంచిది.