తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది సెలబ్రిటీల వారసులు, వారసురాళ్లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వారిలో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా ఒకరు. దొరసాని అనే సినిమాతో శివాత్మిక హీరోయిన్ గా పరిచయమైంది.
మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్న శివాత్మికకు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దొరసాని సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఆ సినిమా ఫ్లాప్ అయినా స్టార్ కిడ్ అవడంతో శివాత్మిక కు అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ అవి కూడా అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి.
దీంతో చేసేదేమీ లేక అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ కాలం వెల్లదీస్తుంది.