నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం చిన్న చిట్కాలు..

9th April 2026

White Scribbled Underline

లోయర్ బ్యాక్ పెయిన్ ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్య. ఎక్కువసేపు కూర్చోవడం, రాంగ్ పోస్చర్, వ్యాయామం లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు.

రోజంతా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల నడుము, మెడ భాగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి 30–40 నిమిషాలకు లేచి కొద్దిసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ చేయడం మంచిది.

సరైన భంగిమలో కూర్చోవడం నడుము ఆరోగ్యానికి చాలా అవసరం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చుంటే మెడ కండరల్ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.

తేలికపాటి వ్యాయామాలు ,యోగా చేయడం కూడా చాలా ఉపయోగకరం. భుజంగాసనం , మార్జారీ ఆసనం వెన్నెముకకు బలం ఇస్తాయి.

వెచ్చని నీటితో స్నానం చేయడం లేదా హాట్ ప్యాక్ ఉపయోగించడం మంచిది. దీంతో కండరాల గట్టితనం తగ్గి నడుము నొప్పి ఉపశమనం పొందుతుంది.

తగినంత నిద్ర , సరైన మెట్రెస్‌పై పడుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి విశ్రాంతి లభిస్తే నడుము, భుజాల నొప్పి సమస్య క్రమంగా తగ్గుతుంది.

CLICK HERE