మనకు కొత్తగా కొనుగోలు చేసిన షూస్, బ్యాగ్స్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులలో చిన్న తెల్లటి ప్యాకెట్లు కనిపిస్తాయి. చాలామంది వాటిని పనికిరావని అనుకుని పారేస్తారు కానీ, వాటిలో ఉన్న సిలికా జెల్ ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు.
సిలికా జెల్ గాలిలోని తేమను పీల్చుకునే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే ఇది వస్తువులను తేమ వల్ల పాడవకుండా కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మొబైల్ ఫోన్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర ఇవి ఉంచితే తేమ ప్రభావం తగ్గుతుంది. దీంతో వాటి లైఫ్ కూడా పెరుగుతుంది.
వెండి ఆభరణాల పెట్టెలో సిలికా జెల్ ఉంచితే అవి నల్లబడకుండా మెరుస్తూ ఉంటాయి. అలాగే పాత డాక్యుమెంట్లు, ఫోటోలు తేమ వల్ల పాడవకుండా రక్షిస్తుంది.
బూట్లు, జిమ్ బ్యాగ్‌లలో ఉంచితే చెడు వాసన తగ్గుతుంది. అలాగే బట్టల అల్మారాలో ఉంచితే బూజు రాకుండా కాపాడుతుంది.
మేకప్ వస్తువులు, పౌడర్లు గడ్డకట్టకుండా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. టూల్‌బాక్స్‌లో ఉంచితే పనిముట్లకు తుప్పు పట్టకుండా కాపాడుతుంది.
అయితే సిలికా జెల్‌ను తినకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలు, పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉంచడం చాలా అవసరం.
ఇవి తేమతో నిండిపోయినప్పుడు ఎండలో ఉంచితే బాగా డ్రై అవుతాయి..తర్వాత వీటిని మళ్లీ ఉపయోగించవచ్చు. ఈ చిన్న ప్యాకెట్లను సరైన విధంగా ఉపయోగిస్తే చాలా ఉపయోగాలు పొందవచ్చు.