మహిళలు అవాంఛిత గర్భధారణను నివారించడానికి ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills) వాడుతున్నారు. ఇవి సులభంగా లభ్యమవుతాయి కాబట్టి చాలామంది వీటిని రెగ్యులర్ గా వాడుతారు. అయితే వీటిని ఎక్కువ కాలం వాడడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు రావచ్చు.
హార్మోన్‌ల అసమతౌల్యం ఈ మాత్రల్లో ఈస్ట్రోజెన్ (Estrogen), ప్రొజెస్టెరోన్ (Progesterone) వంటి హార్మోన్‌లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీని వల్ల హార్మోన్‌ల స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఫలితంగా మానసిక ఆందోళన, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
తలనొప్పి , మలబద్దకం కొంతమంది మహిళల్లో ఈ మాత్రలు తీసుకున్న తర్వాత తలనొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరానికి నీరు తగ్గిపోవడం లేదా హార్మోన్ మార్పుల కారణంగా ఇవి వస్తాయి.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గర్భనిరోధక మాత్రలు తీసుకున్న తర్వాత పీరియడ్స్ (Menstrual Cycle) క్రమం తప్పవచ్చు. కొంతమందిలో రక్తస్రావం తగ్గిపోవడం లేదా ఎక్కువ అవడం కనిపిస్తుంది. ఇది తాత్కాలికమైనదే అయినా గమనించాలి.
సైడ్ ఎఫెక్ట్స్ ఈ మాత్రలు తీసుకోవడం వల్ల కొంతమందికి మొటిమలు, చర్మం ఎండిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఇది హార్మోన్ మార్పుల ఫలితంగా జరుగుతుంది.
వైద్యుల సలహా తప్పనిసరి మాత్రలు వాడకానికి ముందు తప్పనిసరిగా గైనకాలజిస్ట్ (Gynecologist) సలహా తీసుకోవాలి. ప్రతి మహిళ శరీర పరిస్థితి వేరు కాబట్టి, వైద్యుడి సూచనల ప్రకారం మాత్రమే వీటిని వాడడం మంచిది.