8th May 2026

____________

- Saidulu

గంగవల్లి ఆకుకూరలో ఉన్న సీక్రెట్ బెనిఫిట్స్ తెలుసా?

ఆకుకూరలతో చేసే వంటలు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే. మనం రెగ్యులర్‌గా తినే పాలకూర, తోటకూరలతో పాటు గంగవల్లి కూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

గంగవల్లి ఆకుకూరలో ఐరన్‌, కాల్షియం, ఫైబర్‌, విటమిన్ A, విటమిన్ C వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తహీనత తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

అయితే తాజా గంగవల్లి ఆకులతో చేసిన కూరలో ఒక ప్రత్యేకమైన పొడి వేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఆ రుచికి పిల్లలు కూడా ఫిదా అవుతారు.

ముందుగా గంగవల్లి ఆకులను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా సిద్ధంగా ఉంచాలి.

పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేయించి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వెల్లుల్లి వేసి మంచి వాసన వచ్చేలా కలపాలి.

ఇప్పుడు తరిగిన గంగవల్లి ఆకులు వేసి కొద్దిసేపు మూతపెట్టి ఉడికించాలి. ఆకులు మెత్తబడిన తర్వాత మిర్చి పొడి, ఉప్పు కలపాలి.

ఈ కూరలో అసలు మ్యాజిక్ చేసే పదార్థం వేయించిన శనగపప్పు పొడి. చివర్లో ఈ పొడి చల్లితే కూరకు ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది.

శనగపప్పు పొడి వల్ల కూరకు మంచి చిక్కదనం రావడంతో పాటు తినడానికి మరింత రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో కలిపి తింటే ప్లేట్ ఖాళీ అవుతుంది.

సాధారణంగా చేసే ఆకుకూరను చిన్న మార్పుతో ఇలా స్పెషల్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.